22-11-2025 12:17:25 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు – 2025 కోసం జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, కమ్యూనికేషన్, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్ నాయక్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ లతో కలసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, ర్యాంపులు ఇతర సౌకర్యాలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.