22-11-2025 12:19:20 AM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉంటూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితుడు కరీంనగర్ కు చెందిన తిరుపతి నితిన్ వర్ధన్ పై గతంలో కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
నిందితుడి నేర చరిత్ర దృష్ట్యా ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయబడిందని పేర్కొన్నారు. రెండు కేసుల్లో పోలీసులకు దొరకకుండా నిందితుడు వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరుగుతున్నాడని, కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా సమాచారంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు నితిన్ వర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్లు వివరించారు.