calender_icon.png 22 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడికి గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసిన కలెక్టర్ హనుమంత రావు

22-11-2025 12:10:34 AM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి (80) సంవత్సరాలు అనే వ్యక్తి 2024 సంవత్సరంలో తన కుమారుడుకి 18 ఎకరాల 16 గుంటల భూమిని దాన పూర్వకంగా గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది. కానీ తనని చూడట్లేదని, బాగోగులు పట్టించుకోవట్లేదు అని కందాడి జనార్దన్ రెడ్డి మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్/సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 లోని సెక్షన్ 23 ప్రకారం అట్టి 18 ఎకరాల 16 గుంటల స్థలం గిఫ్ట్ డీడ్ ని రద్దు చేయవలసింది lగా జిల్లా కలెక్టర్ కి అప్పీల్ చేసుకోగా సుదీర్గ వాదోప వాదనలు విన్న తర్వాత సీనియర్ సిటిజన్స్ అయిన తల్లి దండ్రులను చూసుకోవట్లేదు అని నిర్ధారణ కావడం జరిగింది దీంతో అట్టి 18 ఎకరాల 16 గుంటల భూమి గిఫ్ట్ సీడ్ ని రద్దు చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని అది విస్మరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.