calender_icon.png 31 October, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకాళి..భూమిశెట్టి

31-10-2025 01:50:45 AM

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆర్‌కేడీ స్టూడియోస్‌తో కలిసి ఇప్పుడు కొత్త చిత్రం ‘మహాకాళి’తో రానున్నారు. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్‌తో పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోందీ సినిమా. ఆర్‌ఏకే దుగ్గల్, రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. సాధారణంగా నాన్-స్టార్ సినిమాలకు భారీ బడ్జెట్ వెచ్చించేందుకు నిర్మాతలు ఆలోచిస్తారు. కానీ, మహాకాళి టీమ్ ఖర్చు విషయంలో సాహసం చేస్తోంది.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూట్ పూర్తిచేసుకుంది. ఇదిలావుండగా, మేకర్స్ తాజాగా ఈ సినిమా లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. కన్నడ భామ భూమిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆమె లుక్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లుక్‌లో భూమిశెట్టి ఎరుపు, బంగారు వర్ణంలో ఆగ్రహం, కరుణ రెండింటినీ ప్రతిబింబించే దివ్యమైన ఆరాతో మెరిసిపోతోంది.

ఇక ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని (పీవీసీయూ) మరో అద్భుత అధ్యాయమని స్పష్టం చేస్తోందీ పోస్టర్. ‘ఫ్రమ్ ద యూనివర్స్ ఆఫ్ హనుమాన్’ అనే ట్యాగ్‌లైన్ ఈ కథ ‘హనుమాన్’తో అనుసంధానమై ఉందనే సంకేతాన్నిస్తోంది. ఈ సూపర్ హీరో పాత్రను పోషించడానికి పలువురు స్టార్ హీరోయినున్ల ఆసక్తి కనబర్చారు. అయినప్పటికీ కథ సారాన్ని నిజంగా ప్రతిబింబించగల, ఆ పాత్రకు సరిపడేలా కొత్త ముఖం కోసం చూశారు. అందులో భాగంగానే టీమ్.. డార్క్ స్కిన్ టోన్, వ్యక్తిత్వం వంటి అన్నిరకాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే భూమిశెట్టిని ఎంపిక చేయడం విశేషం.