21-08-2025 12:58:33 AM
ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపుకు ప్రతిపాదనలు పంపిన, ప్రభుత్వం వద్ద పెండింగ్...?
గత ఏడాది మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హామీ
గద్వాల, ఆగస్టు 20 : జోగులాంబ గద్వా ల జిల్లాలో వెనుకబడిన గట్టు ప్రాంతంలో ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ 580 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు, కేటిదొడ్డి, ధరూరు మండలాల్లో 33 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రణాళికలను రూపొందించింది.
వెనుకబడి న ప్రాంతమైన గట్టు మండలంలో, గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు కావడంతో ప్రజలు సంబరపడ్డారు నిర్మాణ దశలో ఉన్న పనులు ఒక్కసారిగా ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 2. 80 టీఎంసీల నీటిని ఎత్తి పోయడానికి అక్కడ అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్ నిర్మించడంతో పాటు రాయపురం ద గ్గర 1.32 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయ ర్ నిర్మాణం, 3.2 కిలోమీటర్ అప్రోచ్ కెనాల్ నిర్మించాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం మొదటి విడతగా టెండర్లు పిలువగా రూ.. 328 కోట్లతో టెండర్లు దక్కించుకున్న కాం ట్రాక్టర్ 2023 నుంచి పనులు ప్రారంభించారు. రాయపురం దగ్గర రిజర్వాయర్ ని ర్మాణం, అప్రోచ్ కెనాల్ పనులు గత జనవ రి వరకు సాగాయి. కొన్ని నెలల నుంచి కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు.
ప్రభుత్వం వద్ద పెంపు ప్రతిపాదన
గత ఏడాది సెప్టెంబర్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టు ఎత్తిపోతల పథకం పరిశీలన కోసం వచ్చిన ప్పుడు స్థానిక శాసన సభ్యుడితోపాటు, జిల్లా మంత్రులు గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెం చాలని కోరారు.
జూరాల నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నందున 15 టీఎంసీల నుంచి 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ని ని ర్మించాలని ప్రతిపాదించారు. అయితే ర్యా లంపాడు రిజర్వాయర్ నుండి నీటిని తీసుకొని 1.32 టీఎంసీలు ఉన్న రిజర్వాయర్ను 3 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల గట్టు మండలం మొత్తానికి సాగునీరు అందించవచ్చని సూచించారు.
ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు 3 టియంసి లకు ప్రతిపాదనలు పంపించారు. ఇది ప్ర భుత్వం దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉంది. ప్ర స్తుతం 1.32 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్లో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పనులు నిలిపివేశారు .పంపిన ప్రతిపాదనలకు ఆమో దం లభిస్తే రీ డిజైన్ తో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది .
గట్టు మండల ప్రజలకు ఎన్నో ఏళ్ల కళ
ఎత్తిపోతల పథకం గట్టు ప్రజల ఎన్నో ఏళ్ల కళ. వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదట ఈ పథకాన్ని మంజూరు చేసిన తర్వాత మరుగు న పడింది .కేసీఆర్ సీఎం అయిన తర్వాత శంకుస్థాపన చేసిన, ఆయన రెండోసారి సీ ఎం అయిన తర్వాతే గట్టు ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించింది.
పనులు శరవేగంగా సాగుతున్న సమయంలో సామర్థ్యం పెంపు ప్రతిపాదనలతో బ్రేక్ పడింది .వలసలకు నిలయమైన ఈ మండలంలో రిజర్వాయర్ మంజూరూ అయ్యి అది పూర్తయితే నీళ్లు లేక బీడుగా ఉన్న భూముల్లో పచ్చని పంటలు పండుతాయి అని ఆశపడ్డారు. అయితే నిర్మాణ దశలో ఉన్న పనులు ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆమోదం లభించగానే పనులు మొదలుపెడతాం ...
గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం 1.32 టీఎంసీల నుండి త్రీ టీఎంసీల పెంపునకు ప్రతిపాదనలు పంపించాం. ఇంకా ప్రభుత్వ ఆమోదం లభించలేదు ఆమోదం లభించగానే మళ్లీ శరవేగంగా పనులుజరుగుతాయి.
రహీముద్దీన్, ఇరిగేషన్ ఎస్‌ఈ