calender_icon.png 5 September, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కదా కాళేశ్వరం

05-09-2025 12:33:49 AM

-లక్షలాది ఎకరాలు కోట్లాది ప్రజలకు గొంతు తడుపుతున్న కాళేశ్వరం జలాలు 

-కాళేశ్వరం పై అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ 

-కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టపై బిఆర్‌ఎస్ ఇదే కాళేశ్వరం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శన

 గజ్వేల్, సెప్టెంబర్ 4 : మేడిగడ్డ మొదలుకొని కొండపోచమ్మ వరకు జలగల పా డుతున్న కాలేశ్వరం జలాలు రైతుల పొలాలను తడపడంతో పాటు, కోట్లాది ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయని, ఇది కదా కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అని గజ్వే ల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఇంచార్జ్ వం టేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.

గజ్వేల్ నియోజకవ ర్గం టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలసి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టపై ఇది కదా కాలేశ్వరం అంటూ ఫ్లెక్సీని ప్రదర్శిం చి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలు పంట సాగు కావడంతో పాటు కోట్లాది ప్రజల కు తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. ఉద్యమానికి ముందే రైతుల కష్టాలను చూసిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రైతులు సాగునీటి కోసం కష్టపడొద్దని కాలేశ్వరం ప్రాజె క్టు నిర్మించార న్నారు.

సాగునీరు లేక బీడువారిన ఎన్నో భూము లు ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చాయన్నారు. కాలేశ్వరం ప్రా జెక్టు ద్వారా కోటి యాభై లక్షల పంట సాగు జరగడంతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. మల్ల న్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ల ద్వారా మండుటెండర్లో కూడా రైతుల పొలాలకు గోదావరి జలాలను ఇచ్చిన ఘనత కేసిఆర్ దేనన్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన మహాశక్తి కేసీఆర్ అన్నారు.

గోష్ కమిషన్ ఒక ఫేక్ కమిషన్ అని, కెసిఆర్ హరీష్ రావు లను ఇబ్బం ది పెట్టడానికి తప్పుడు నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిందని మండిపడ్డారు. ఎలాంటి తప్పిదాలు దొరకకపోవడ ంతోనే మోడీతో జతకట్టి కాలేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. కవితను అడ్డుపె ట్టుకొని బిజెపి కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ను హరీష్ రావును అవమానం పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలకు వెళ్లడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ మా జీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ దేవి రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, బెండ మధు, నవాజ్ మీరా, మాజీ ఎంపీపీలు పాండు గౌడ్, సుగుణ దుర్గయ్య, ల తా రమేష్ గౌడ్, జడ్పీటీసీలు మల్లేశం, అర్జున్ గౌడ్ పాల్గొన్నారు.