calender_icon.png 5 September, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు చేయనప్పుడు భయం ఎందుకు?

05-09-2025 12:34:46 AM

  1. దోషులకు శిక్ష పడితేనే భవిష్యత్తు బాగుంటుంది 

విలేకరుల సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి పైన విచారణ జరిపి దోషులను సత్వరమే శిక్షించేందుకే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి సిబిఐకి కేసును అప్పగిస్తే తప్పేముందని తప్పు చేయనప్పుడు భయమెందు కు అని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధు సూదన్ రెడ్డి పేర్కొన్నారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టును క్యాబినెట్ అసెంబ్లీలో చర్చించకు పెట్టింది, హోష్ కమి టీ నివేదిక చూసిన తర్వాత కాళేశ్వరం ప్రాజె క్టు లో ఏవిధంగా తప్పు జరిగింది అనేది ఆ నివేదిక చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తప్పు చేసిన దోషులను శిక్షించాలంటే జరిగిన అవినీతిపైన సమగ్ర వి చారణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేశారని ఆయన తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర పోలీ సు వ్యవస్థ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పోలీసు అధికార పరిధి రాష్ట్ర పరిధిలో మాత్రమే పరిమితం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికలో అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబం ధించి విషయం ఉంది , తుమ్మిడి గడ్డ ప్రాజెక్టును మేడి గడ్డ కు మార్చడం, సిడబ్ల్యుసి ఇచ్చిన లేఖల ఆధారం, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారిచ్చిన రిపోర్టులు అన్ని రిపోర్టులను ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపో ర్టు ఇచ్చిందన్నారు.

దోషులకు శిక్ష పడాలంటే మరింత విచారణ వేగవంతం చేయా లంటే , డిల్లీ కేంద్రంగా ఉండే సంస్థల నుంచి డాక్యుమెంట్స్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీసులు కానీ మిగతా ఏజెన్సీలు ప్రయత్నం చేస్తే రావన్నారు. సిబి ఐ పరిధిలో మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయన్నారు. కాలేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి ఎన్నో ఏజెన్సీలు ఫండింగ్ చేశాయన్నారు అందులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్యాంకులు సైతం ఉన్నాయన్నారు.

దాంట్లో కూడా అవినీతి కనిపిస్తుం దని అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఏడు నుంచి ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ ఉంటుందని కానీ లక్షల కోట్లు తెచ్చిన ప్రాజెక్టుకు 10.5 ప్రకా రం ఇంట్రెస్ట్ తెచ్చారు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బ్యాంకులను వాటిని ఎంక్వయిరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసు వ్యవస్థలు ఇతర ఏజెన్సీలకు అధికారాలు ఉండవన్నారు. 

కాబట్టి సత్వర విచారణకు సిబిఐ కరెక్ట్ అని చెప్పి టెక్నికల్ అంశాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి క్యాబినెట్ చర్చించి సిబిఐ కి అప్పగించారన్నారు. బిజెపి నాయకులు ఆక్షేపించ డానికి ఏమీ లేదని అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఒబెదుల కొత్వాల్, నాయకులు మిథున్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.