calender_icon.png 1 August, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్‌కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుంది

30-07-2025 12:00:00 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

బోయినపల్లి జూలై 29(విజయక్రాంతి ): రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ విషయంలో లబ్ధిదారులు ఎవరు ఆందోళన గురి కావద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. మంగళవారం సాయంత్రం బోయినపల్లి రైతు వేదికలో మండలంలోని అర్హులైన  1070 కుటుంబాలకు రేషన్ కార్డులు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉండి ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఆయన చెప్పారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ తో పాటు 1971 మందిని రేషన్ కార్డులో చేర్చినట్లు ఆమె చెప్పారు.

నూతనంగా దాదాపుగా 6000 మంది కుటుంబాలకు రేషన్ కార్డులు అందరూ ఉన్నాయని ఆయన చెప్పారు ప్రజల జీవన విధానంలో భాగంగా చాలా కీలకమైన డాక్యుమెంట్ మనీ కరెంట్ కనెక్షన్ ఇందిరమ్మ ఇళ్లను రేషన్ కార్డులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల  అధికారి రజిత, తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏవో ప్రణీత, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్  డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసి చైర్మన్ ఎల్లేష్, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పి టీ సీ పులి లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముదిగంటి  సురేందర్ రెడ్డి, కూస రవీందర్, మహేశ్వర్ రెడ్డి.