10-10-2025 06:09:18 PM
పెన్ పహాడ్: ప్రతి విద్యార్థి శాస్త్రీయ - సాంకేతిక రంగాల్లో ముందుండాలని అంతరిక్ష పరిశోధన విభాగలపై మరింత ఆసక్తి పెంపొందించుకొని భవిష్యత్తులో రాణించాలని ఇస్ట్రాక్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్ వెంకటరమణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అనాజిపురం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికలపై పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల ప్రయోగ విధానం, రాకెట్ సాంకేతికత, భారత అంతరిక్ష పరిశోధనలో సాధించిన విజయాలు వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులలో దాగివున్న సందేహాలను ఆయన నివృత్తి చేశారు.