24-07-2024 02:58:32 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): 2047 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్‌ను నెంబర్‌వన్‌గా చూడాలనే ప్రధాని మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏకంగా రూ.11.50 లక్షల కోట్లను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమన్నారు. సామా న్యుడి మొదలు.. పారిశ్రామికవేత్తల వరకు ప్రయోజనం చేకూ ర్చేలా ఉందన్నారు.
వ్యవసాయ పరిశోధనలకు పుట్టిల్లుగా ఉన్న తెలంగాణకు ఈసారి బాగా మే లు జరగబోతోందన్నారు. తెలంగాణకు మొండిచేయి చూపారంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమ ని బండి కొట్టి పారేశారు. వారి అవగాహనారాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో తెలంగాణ సహా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోందన్నారు. శాఖల వారీగా బడ్జెట్‌లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.
బయ్యారం విషయంలో..
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టం లో పొందుపర్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమైతే... దానికి వంతపాడింది కేసీఆర్ అనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బయ్యారం ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చిందని.. కేంద్రంతో పనిలేకుండా రాష్ర్టమే బయ్యారం ఉక్కుఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుందని ప్రగల్భా లు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏం సాధించారో సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.