17-05-2025 05:15:58 PM
మంత్రి శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి..
ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం దే..
మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు..
నల్లగొండ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna)ను ఆహ్వానించకపోవడం దురదృష్టకరం, కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానించడం పట్ల మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, మలమానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య ఆదేశాల మేరకు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలని, ఎంపీకి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మాల సామాజిక వర్గానికి చెందిన ఎంపీ వంశీకృష్ణకే ఇలాంటి అవమానం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జంగాల లక్ష్మమ్మ, రాష్ట్ర కార్యదర్శులు జంగాల బిక్షం, గండమల్ల జానయ్య, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు రువ వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు రువ అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.