05-08-2025 12:13:04 AM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బోనాల పండుగను శాంతి యుతంగా జరుపుకోవడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేర కు సోమవారం భోలక్ పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్య నగర్ లో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ రాష్ర్ట యువ నాయకుడు ముఠా జై సింహ లను బస్తివాసులు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కా ర్యక్రమంలో బిఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ మీడియా ఇన్‌చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.