26-08-2025 01:09:41 AM
- మీనాక్షి నటరాజన్, మహేశ్ ల కితాబు
కొత్తపల్లి, ఆగస్టు 25 (విజయ క్రాంతి): పేద ప్రజలకు సామాజిక సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును వెలిచాల రాజేందర్ రావు ఏర్పాటు చేయడం ఆదర్శనీయమనీ, సమాజానికి చక్కగా ఉపయోగపడే మంచి కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
సోమవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో సరల్ జగ్ ట్రస్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నేత స్వర్గీయ వెలిచాల జగపతిరావు సరళ దేవి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. వెలిచాల రాజేందర్ రావు త్వరలో చేపట్టనున్న సామాజిక సేవా కార్యక్రమాలను వారికి వివరించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.