calender_icon.png 26 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక సులభ పద్ధతిలో పింఛన్ల పంపిణీకి చర్యలు

26-08-2025 01:11:42 AM

పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్లకు ఎఫ్.ఆర్.ఎస్ మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాల పంపిణి లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి ఆగస్టు 25 (విజయ క్రాంతి) జిల్లాలో చేయూత ఫించన్లను సులభ పద్ధతిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పెన్షన్లు పంపిణీ చేసే పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్లకు ఎఫ్.ఆర్.ఎస్ మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డ చేయూత పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా ముఖ గుర్తింపు పద్దతి ఆధారముగా (ఎఫ్.ఆర్.ఎస్) పోస్టల్ పెన్షన్లు సులభముగా పంపిణీ చేయుటకు 22 మంది పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్లకు మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను (మంత్ర డివైజ్) అందిస్తున్నామని అన్నారు.

జిల్లాలోని నాలుగు మండలాలలో (మంథని, జూలపల్లి, రామగిరి మరియు సుల్తానాబాద్) 44 గ్రామాలలో గల 6921 మంది పింఛను దారులకు సులభముగా పింఛన్లు పంపిణి చేయుటకు ఈ యంత్రాలను ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని , అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.