12-05-2025 01:11:54 AM
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి): భారత దేశ రక్షణ, సమగ్రత కోసం పాకిస్థాన్తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న భారత సైనికులకు అండగా నిలబడటం మనందరి బాధ్యత అని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు.
భారత త్రివిధ దళాలకు మద్దతుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు సరిహద్దుల వద్ద పోరాడుతున్న సైనికుల విజయం, క్షేమం కాంక్షిస్తూ ఆదివారం గాంధీనగర్ డివిజన్ లోని చిక్కడపల్లి వివేక్ నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, దామోదర్, శ్రీకాంత్,సత్తి రెడ్డి, సురేష్ రాజు, ఆనంద్ రావు, సత్యేందర్,రఘు యాదవ్, సాయి తరుణ్, నీరజ్, శ్రీనివాస్, సంయుక్త రాణి తదితరులు పాల్గొన్నారు.