12-05-2025 01:10:11 AM
కామారెడ్డి, మే 11 (విజయ క్రాంతి): కామారెడ్డి మండలం పాత రాజంపేట గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు రామకృష్ణ ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం పాత రాజంపేటలో నీ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా తమ కుటుంబాన్ని ఆదుకుంటామని అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే పంప గోవర్ధన్ హామీ ఇవ్వడం జరిగింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్, నాయకులు పాల్గొన్నారు.