13-05-2025 08:11:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాతో పాటు ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు(Charitable Organizations) తమ సేవా కొరకు తిరిగి రెన్యువల్ చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అంబాజీ నాయక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలతో పాటు గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థ సేవల ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈనెల 31 వరకు గుర్తింపు పొందిన సేవా సంస్థలు ప్రత్యేక పోటోలు తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.