23-01-2026 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే షిండే
బిచ్కుంద, జనవరి 22 (విజయక్రాంతి): బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన బాయికాడి జగదీష్ (పుస్తకాల కవి, రచయిత) గురువారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జగదీష్ మరణవార్త తెలుసుకున్న వెంటనే జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలోని జగదీష్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ... చిన్న వయసులోనే ఒక మంచి కవి, రచయితను కోల్పోవడం చాలా బాధాకరం. తన రచనల ద్వారా సమాజానికి మంచి సందేశాలు అందించిన జగదీష్ లోటు ఎప్పటికీ తీరదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన హన్మంత్ షిండే ఈ దుర్ఘటనను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
జగదీష్ మృతి సాహిత్య రంగానికి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.జగదీష్ అకాల మరణంతో బిచ్కుంద పట్టణం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ స్ పార్టీ పట్టణ అధ్యక్షులు అవర్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, మాజీ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలన్న, అరవింద్, మాజీ వార్డ్ మెంబర్ సాయిని శంకర్, బి ఆర్ స్ యువ నాయకుడు చేతన్, తదితరులు పాల్గొని నివాళ్లు అర్పించారు.