calender_icon.png 23 January, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసందోహం కానున్న జాన్‌పహాడ్

23-01-2026 12:00:00 AM

ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు

నేడు గంధం ఊరేగింపు..

ఇతర రాష్ట్రాల నుండి భారీగా రానున్న భక్తులు

భారీగా పోలీసు బందోబస్తు

హుజూర్ నగర్ (పాలకీడు), జనవరి 22: మత సమరస్యానికి ప్రతీకాగా నిలిచిన జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవ వేడుకలు గురువారం తెల్లవారుజామున గుసుల్ షరీఫ్ తో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను మూడు రోజుల పాటి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు గుసుల్ షరీఫ్, రెండవ రోజు గంధం ఊరేగింపు, మూడవ రోజు పూజలు నిర్వహించి సాయంత్రం వేళ చీకటి పడే సమయానికి దీపారాధన చేసి ఉర్సు వేడుకలను ముగిస్తారు. గురువారం రాత్రి వక్ఫ్ బోర్డు నుండి తెచ్చిన గంధన్ని వక్ఫ్ బోర్డు అధికారులు దర్గాలోని బాబా సమాధులపై ఎక్కించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బుధవారం రాత్రి నుంచే ఫకిర్లు దర్గాకు చేరుకొని రాత్రంతా ఆటపాటలతో భక్తులను ఎంతగానో అలరింపజేశారు

నేడు గంధం ఊరేగింపు..

హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుండి తెచ్చిన గందాన్ని, ముజావర్లు తెచ్చిన గందాన్ని, దర్గా కాంట్రక్టర్లు తెచ్చిన గందాన్ని దర్గాకు కొంత దూరంలో ఉన్న చందన్ ఖాన్ లో పెట్టి దర్గా కు వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ గందాన్ని బిందెలో పెట్టి దర్గా చుట్టుపక్కల గ్రామాలలో గుర్రంపై ఊరేగింపు చేసి దర్గాలోని బాబా సమాధులపై సమర్పిస్తారు.

లక్షకు పైగానే హాజరుకానున్న భక్తులు..

ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గంధం ఊరేగింపు కావడంతో విశేషం ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేదుకు తెలుగు రాష్ట్రలతోపాటు వివిధ రాష్ట్రలకు చెందిన భక్తులు హాజరయ్యే అవకాశముందని వక్ఫ్ బోర్డు అధికారులు తెలుపుతూన్నారు

నేడు దర్గాకు మంత్రి ఉత్తమ్..

మండలంలోని పవిత్ర జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో, ప్రధాన ఘట్టం నేడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర భారీ నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమారర్ రెడ్డి హాజరు కానున్నానట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు.