calender_icon.png 18 January, 2026 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం హేయం

18-01-2026 12:00:00 AM

మా నేతల అరెస్ట్‌లను ఖండిస్తున్నాం

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి17(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మే మా ఏడో గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీ మం త్రి హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మం డిపడ్డారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీశ్‌రావు ఈ అరెస్టు లను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యం గా మార్చడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మీ నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చారిత్రక సికిందరాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని వెల్లడించారు.