calender_icon.png 14 August, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచార యత్నం కేసులో వ్యక్తికి జైలుశిక్ష

14-08-2025 12:06:33 AM

జహీరాబాద్, ఆగస్టు 13 : జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగల మధురై తాండకు చెందిన వ్యక్తి  మైనర బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ స్పెషల్ ఫోక్స్ జడ్జి జయంతి తీర్పునిచ్చారు.

మధురై తాండకు చెందిన సంజీవ్(30) 7 జులై, 2020లో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటిలోకి ప్రవేశించి అత్యాచారయత్నం చేశాడని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి స్టేషన్ హౌస్ అధికారి గణేష్ కేసు నమోదు చేసి కేసు పూర్వపరాలను పరిశీలించి కోర్టుకు సమర్పించారు. 

అనంతరం కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరిరెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారి గణేష్, ప్రస్తుత ఎస్.ఐ రాజేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, లైసెనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్ శంకర్, సత్యనారాయణను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.