07-08-2024 12:00:00 AM
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయం వందలాది మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకు పోయాయి. ఆప్తులతోపాటు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వారు తిరిగి నిలదొక్కుకోవడం చాలా కష్టం. స్వయంగా వారి వల్ల అయ్యే పనికూడా కాదు.
తలా ఓ చేయి వేసి వారిని ఆదుకోవడం మానవ ధర్మం. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు విదేశాల్లోని కేరళీయులు ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేసినట్లు మీడియాలో కథనాలు చదువుతున్నాం. రాష్ట్రప్రభుత్వాలు కూడా తమ వంతు సాయాలను ప్రకటిస్తున్నాయి.
కానీ, సామాజిక బాధ్యత కలిగిన సినీరంగం, కార్పొరేట్ సంస్థలు అశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. చిరంజీవి, అల్లు అర్జున్ వంటి కొంతమంది నటులు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. కానీ, మొత్తంగా సినీ రంగంతోపాటు కార్పొరేట్ దిగ్గజాలు కదిలి రావలసిన అవసరం ఉంది. ఇది వారి సామాజిక బాధ్యతగా పరిగణించాలి. తాము సంపాదించిన దానిలో కొంతయినా తోటివారి కోసం అందిస్తే అందరూ హర్షిస్తారు.
కె. సురేశ్ కుమార్, హైదరాబాద్