calender_icon.png 6 September, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రధానం

07-08-2024 12:00:00 AM

దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ జలకళతో నిండుకుండలను తలపిస్తూ ఉండడంతో రైతన్నలు ఎంతో సంతోషిస్తున్నారు. గత ఏడాది ఒక్క పంటకే సాగు నీరు లభించని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ రైతాంగం ఈసారి రెండు పంటలు పండించే స్థితిలో ఉండడం ముదావహం.

అయితే, వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాల కారణంగా ఎత్తిపోతలు జరగక లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతి పక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.

అధికారంలో ఉన్న వాళ్లయినా, ప్రతిపక్షమైనా ప్రజల సంక్షే మం గురించే ఆలోచించాలి. ఆ విషయంలో ఈ రెండు పక్షాలు కూడా తప్పు చేస్తున్నాయనే భావన రాకముందే మేల్కొంటే బాగుంటుంది. ప్రకృతి కరుణించి పుష్కలంగా వానలు కురవడంతో జలా శయాలు కూడా నిండాయి.

దీంతో రైతులు మిగతా ఆలోచనలు పక్కన పెట్టి వ్యవసాయంపై దృషి ్టసారిస్తున్నారు. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు వంటివాటిని సకాలంలో అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పంటలు పుష్కలంగా పండితే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని పాలకులు గ్రహించాలి.

 వెంకటేశ్వర రావు, ఖమ్మం