calender_icon.png 31 August, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభలో కేసీఆర్ ఉంటేనే మజా!

31-08-2025 01:17:43 AM

రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. కేసీఆర్ కాక అసెంబ్లీ సమావేశాలకు హజరవుతాడా? లేదా? అనే చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, సీఎం దాకా ప్రతిఒక్కరూ... కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని, సలహాలు సూచనలివ్వాలని కోరుతుంటే...కేసీఆర్ మాత్రం ఈ విషయంపై ఒక్క మాటకూడా మాట్లాడటంలేదు. మౌనం వహిస్తున్నారు. అధికారపక్షం మాత్రం కాళేశ్వరం నివేదికపై సభలో చర్చించి కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో కేసీఆర్ రాక కోసం ప్రజలతోపాటు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ వస్తారా? రారా? అని. ఒకవేళ వస్తే కేసీఆర్ మార్క్ పంచ్‌లు, డైలాగులు, సామెతలు మరోసారి వినొచ్చని భావిస్తున్నారు. సభలో కేసీఆర్ ఉంటేనే ఈ సమావేశాల్లో హాట్ హాట్‌గా చర్చ సాగుతుందని, లేకుంటే సాదాసీదాగా, చప్పగా ఉంటాయనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

రమేశ్ మోతె