calender_icon.png 23 May, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన మహిళలకు ఇసుక ర్యాంపులు ఐటీడీఏ పీఓ రాహుల్

23-05-2025 02:06:11 AM

భద్రాచలం మే 22 (విజయక్రాంతి) గిరిజన గ్రామాలలో పిసా యాక్ట్ ప్రకారం  గిరిజన మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్న ట్లు ఐటిడిఏ పిఓ రాహుల్ స్పష్టం చేశారు.  తమ గ్రామాలలోని  గిరిజన మహిళా సోసైటీల కే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు.

గురువారం  ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీలతో ఒకరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ మహిళలతో ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తు న్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి ఇసుక ర్యాంపుల నిర్వహణ వారికి అ ప్పగించకుండా మహిళలందరూ ఐకమత్యంగా ఉండి గోదావరిలో నుండి ఇసుక వెలికితీత, నిర్వహణ బాధ్యత చేపట్టాలన్నారు.

ఏజెన్సీ ప్రాంతంలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న సొసైటీలు సొంతంగా ఇసుక ర్యాంపులు నిర్వహించుకోవడానికి, తద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంతకుముందు ఇసుక ర్యాంపుల నిర్వహణ తీరు, ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు.

ఇసుక ర్యాంపులు నిర్వహించే మహిళలు ఆ గ్రామానికి సంబంధించిన వారే ఉండాలని, బినామీలను ఎవరిని దరిచేరకుండా చూడాలని, ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళలు ఇసుక ర్యాంపుల పూర్తి బాధ్యత తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.ఇసుక ర్యాంపులు సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళలకు సాంకేతిక సహకారం,

ఆర్థిక సహకారంతో పాటు మహిళలందరికీ తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక అధికారులను నియమించి, వారి ద్వారా తగిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందన్నారు.  Lఈ కార్యక్రమంలో పిసా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్,తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడి మైన్స్ దినేష్ కుమార్ వివిధ గ్రామాల నుండి వచ్చిన సొసైటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.