23-05-2025 02:06:12 AM
శృంగేరి పీఠం అనుమతితో ఆలయ అభివృద్ధి పనులు
ప్రభుత్వ విప్ అది శ్రీనివాస
సిరిసిల్ల, మే 22(విజయక్రాంతి): వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రణాళికా బద్దంగా విస్తరణ పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.గురువారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత క్రింద 484 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,గతంలో పాలకులు వేములవాడ ఆలయానికి 100 కోట్లు విడుదల చేస్తామని మోసం చేశారని, నేడు ప్రజా ప్రభుత్వంలో వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.వర్షాకాలం ముగిసిన తర్వాత 3వ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు.గుడి చెరువు లో మురుగు నీరు కల్వకుండా 9 కోట్ల ఖర్చు చేసి నివారణ చర్యలు చేపట్టామని అన్నారు. మూల వాగు శుభ్రం చేస్తున్నామని అన్నారు.
వేములవాడ ఆలయ విస్తరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని, ఆలయం మూసివేస్తామని అపోహలు సృష్టిస్తున్నారని, భక్తులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నిత్యం స్వామివారికి నిత్యకృత్యం కైకంకర్యాలు జరుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ శంకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ సెస్ డైరెక్టర్ ఉమా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.