calender_icon.png 4 July, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసాబ్‌తో ఐటమ్ సాంగ్

03-07-2025 12:15:00 AM

ప్రభాస్ కథానాయకుడిగా పీపుల్స్ మీడి యా ఫ్యాక్టరీ, ఐవీయూ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మాతలు కాగా.. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీకుమార్ కథానాయికలు.

వీళ్లే కాకుండా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, జిషుసేన్‌గుప్తా తదితరులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. వీరితోపా టు ఈ చిత్రంలో కరీనాకపూర్‌ఖాన్ కూడా నటిస్తోందనేది తాజా సమాచారం. ఐటమ్ సాంగ్‌ను మించిన ఓ పాట కోసం కరీనాకపూర్‌ను రంగంలోకి దించారట మేకర్స్. త్వరలోనే ఆ పాటను హైదరాబాద్‌లో షూట్ చేస్తారని టాక్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే, సుమారు రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం తొలుత దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారను ముందుగా సంప్రదించారు. ప్రత్యేక గీతాల్లో నటించడానికి నయన్ నిరాకరించడంతో ఆ అవకాశం కరీనా తలుపు తట్టింది. కరీనా ఈ ఐటం సాంగ్‌లో నటించేందుకు సుముఖంగా ఉండటంతో ఆమెనే ఓకే చేశారట దర్శకనిర్మాతలు.