calender_icon.png 5 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం అందించాలి

04-07-2025 07:48:11 PM

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసిన కలెక్టర్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పరిసరాలను పరిశీలించడంతో పాటు వంట గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి  ముచ్చటిస్తూ భోజనం చేశారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థులు చాలా ఆనంద పడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయులు నిత్యం పరిశీలిస్తూ ఉన్నత చదువులు చదివే విధంగా నాణ్యమైన బోధన చేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మేరకు ప్రతిరోజు మెనూ పాటించాలని, సమయానికి ఆహారం అందించడంతో పాటు విద్యను బోధించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించాలని, కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలని అన్నారు.