04-07-2025 07:38:28 PM
భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పరిశీలన
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు,జూలై4(విజయక్రాంతి): ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని రాచపల్లి గ్రామంలో,మల్లాపురం హ్యాబిటేషన్ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.తెలిపారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు ఏవైనా సాంకేతిక లేదా సామగ్రి సంబంధిత సమస్యలున్నాయా ఇసుక ఎక్కడి నుండి తీసుకుంటున్నారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. మండలంలో ఇసుక అందుబాటులో ఉందని,లబ్ధిదారులు అక్కడినుండే తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫోటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని,లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అనంతరం శుక్రవారం వెంకటాపురం మండలం తహసిల్దార్ కార్యాలయంలో రికార్డ్ రూమ్ పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూగూర్ రెవిన్యూ గ్రామంలో డ్రోన్ సర్వేపై ఏడి సర్వే డిపార్ట్మెంట్, సర్వేయర్లు మరియు ఏజెన్సీలు నిర్వహించిన సర్వే తీరును అధికారులు కలెక్టర్ కు వివరించారు. సర్వే మ్యాప్ లను కలెక్టర్ పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సుల దరఖాస్తుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్ లో వెను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.