calender_icon.png 5 July, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్గే సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

04-07-2025 07:41:33 PM

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే 

బెజ్జంకి: జై భీమ్ జై సంవిదన్ కార్యక్రమంలో బాగా శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున సభను విజయవంతం చేయడానికి మానకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి బెజ్జంకి క్రాసింగ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే కావ్వంపెల్లి సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, నియోజకవర్గంలోని బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.