calender_icon.png 5 July, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత సమస్యలు పరిష్కరించాలి

04-07-2025 07:44:18 PM

తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు కర్నాటి మారయ్య అన్నారు.శుక్రవారం సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కు తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అంద జేశారు. మూడేళ్ల క్రితం చేనేత క్లస్టర్ కు మంజూరైన రూ.75 లక్షలు వెంటనే విడుదల చేసి పనులు చేపట్టాలని కోరారు. సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘంలో 390 మంది సభ్యులు ఉన్నారని, వారు ఏడాదికి 5000 పట్టు చీరలు ఉత్పత్తి చేయగలరని తెలిపారు. ఆ చీరలను టెస్కో ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  స్థానిక చేనేత సహకార సంఘం క్యాష్ క్రెడిట్ కోటికి పెంచాలని, క్యాష్ క్రెడిట్ రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. చేనేత మగ్గాలన్నింటికీ జియో ట్యాగ్ చేయించాలని, జియో టాగ్ ఉన్న ప్రతి మగ్గానికి లక్ష చొప్పున వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని కోరారు.