calender_icon.png 23 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంటె కాదు.. ధర వింటేనే దడ

23-01-2026 12:00:00 AM

  1. ఏడాదిలో బంగారం రెండింతలు.. వెండి మూడింతలు పెరుగుదల
  2. పడిపోయిన వ్యాపారం... పరేషాల్లో కార్మికులు

నిర్మల్, జనవరి ౨౨ (విజయక్రాంతి): ప్రజ ల స్థిరాస్తిలో వ్యవసాయం తర్వాత బంగారం వెండి ప్రధానం. అటువంటి వెండి, బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ చేరుకోవడంతో సా మాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో బంగారం వెండి ధరలు కొం టె కాదు. . వింటేనే గుండె గుబెల్ మంటుంది. ప్రస్తుతం మార్కెట్లో షేర్ మార్కెట్‌లో బంగా రం వెండి ధరలు నువ్వా.. నేనా అనే రీతిలో రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

ప్రస్తుతం నిర్మల్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర రూ ౧,52,300 పలుకగా, వెండి కిలో దొర ధర రూ 3,20,100 ధర పలికింది. గత ఏడాది ఇదే సీజన్లో 10 గ్రాముల బంగా రం ధర రూ. 79,600 ఉండగా వెండి రూ. 905 మాత్రమే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలోని బంగారం ధర దాదాపు రెట్టింపు కాగా వెండి ధర మూ డింతలు పెరిగింది. ఈ జనవరి నెల నుండి బంగారం వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

వారం రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ 1.39 లక్షలు ఉండగా వెండి ధర రూ 2400 ఉన్నది. వారం రోజుల్లో బం గారం 12000 పెరుగుగా వెండి 800 పెరిగిం ది. గతంలో వెండి బంగారం ధరలు రోజుకు ఒకేసారి పెరిగేవి. కానీ వారం రోజులుగా వెండి, బంగారం ధరలు రోజుకు మూడుసార్లు ఉదయం, పగలు, సాయంత్రం పెరుగుదల కావడం వెండి బంగారం వ్యాపార చేస్తున్న యజమానుల్లో కలవరాన్ని గురిచేస్తుంది. ప్రస్తుతం మూఢమాసం పెళ్లిళ్లు శుభకార్యాలు లేనప్పటికీ వెండి బంగారం ధరలు రోజురోజు కు అమాంతంగా పెరగడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

పడిపోయిన వ్యాపారం..

మార్కెట్లో వెండి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైంసా పట్టణాల్లో సుమారు 300 వెండి బంగారం దుకాణాలు ఉండగా క్రయవిక్రయాల ద్వారా వచ్చిన కమిషన్లతో వీరి కుటుంబాలు పోషిం చుకుంటున్నారు అయితే మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగిపోవడంతో సామాన్య మద్దతు ప్రజలు బంగారం వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నెల రోజులుగా బంగారం వ్యాపార దుకాణాలు జనం లేక బోసిగా కనిపిస్తున్నాయి.

పెండ్లిలు శుభకార్యాల సీజన్లో బంగారు వెండి ఆభరణాలు తయారు చేసే కార్మికులు కులవృత్తుల వారు ధరల పెరుగుదల కారణంగా పనులు లేక కుటుంబ ఆదాయ వనరులు తగ్గిపోవడం తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృత్తిని నమ్ముకుని వ్యాపారం చేస్తున్న కూలి పనులు చేస్తున్న వారు దుకాణాల రెంటు, నిర్మాణ ఖర్చులు కూలీల ఖర్చులు వెళ్లడం లేదని.. రోజుకు ఒక తులం రెండు తులాలు వెండి బంగారం కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టి వేరే వ్యాపారాన్ని చేసుకునే ఆలోచనలు  చేస్తున్నారు.

వ్యాపారంపై తీవ్ర ప్రభావం

మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరగడంతో మార్కెట్ పై ఆ ప్రభావం పడింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు రోజుకు నాలుగు సార్లు పెరుగుతున్నాయి బంగారం వెండి ధరలు పెరగడం వల్ల సామాన్య మద్దతు ప్రజలు కూడా కొనుగోలు చేయడం లేదు ధర చెప్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వెండి బంగారం వ్యాపారంపై ఆధారపడ్డ కుటుంబాలకు పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి కూలీల సైతం పని దొరకడం లేదు.

- కోటగిరి అశోక్, వెండి బంగారం సంఘం జిల్లా అధ్యక్షుడు

ధర వింటేనే భయమేస్తుంది..

మార్కెట్లో వెండి బంగారం ధర లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వెండి ధర 10 గ్రాములు 3200 బంగారం ధర రూ 1.52 ధర పలుకుతుంది గత ఏడాదితో పోలిస్తే బంగారు ధర రెండింతలు వెండి ధర మూడింతలు పెరిగింది సామాన్య మద్దతు ప్రజలు  కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరల నియంత్రణకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి.

-బద్రి రజిత