calender_icon.png 29 December, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌ బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులా...

29-12-2025 03:40:11 PM

మాజీ సర్పంచ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు కనవేన శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): గతంలో తాము చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరితే అక్రమ అరెస్ట్‌లకు పాల్పడటం విడ్డూరంగా ఉందని మాజీ సర్పంచ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు కనవేన శ్రీనివాస్ విమర్శించారు. పెండింగ్‌ బిల్లుల కోసం చేపట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమ నేపధ్యంలో మంథని పోలీసులు పలువురు సర్పంచ్‌లను ముందస్తు అరెస్ట్‌ చేసి మంథని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకుండా ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు.

సామాన్య ప్రజలను అక్రమ కట్టడాల పేరుతో ఇండ్లు కూల్చివేస్తూ కాలం వెల్లదీస్తోందని ఆయన దుయ్యబట్టారు. తమకు రావాల్సిన బిల్లుల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, చివరకు ఛలో అసెంబ్లీ ముట్టడికి శ్రీకారం చుడితే అక్రమంగా అరెస్ట్‌లకు పాల్పడతోందని ఆయన అన్నారు. అభివృధ్ది, సంక్షేమంపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రజాప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పే రోజులు వస్తాయని ఆయన అన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో గాజులపల్లి సర్పంచ్ కరెంగుల సుధాకర్. మల్లేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల తిరుపతమ్మ రవి ఉన్నారు.