18 March, 2026 | 4:26 AM

పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని నియమించాలి

18-03-2026 01:28 AM

మంత్రి కోమటిరెడ్డి 

హైదరాబాద్, మార్చి17(విజయక్రాంతి): పీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడు ప్రజల మధ్య ఉం డే మాస్ లీడరని, ఆయన పనితీరు ఆమోఘమని మంత్రి ప్రశంసించారు. మంగళవారం ఆసెంబ్లీలో లాబీలో మంత్ర కోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

దివంగత నేత పి. జనార్దన్‌రెడ్డి తరహాలో జగ్గారెడ్డికి ఆ పదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉంద ని, ఆయన మరో పీజేఆర్ అంటూ మంత్రి అభివర్ణించారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో రూ. 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు.  పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.