12-11-2025 07:44:11 PM
ఆర్ఎస్ఎస్ జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ రాకేష్ జైన్..
ఎల్బీనగర్: వనస్థలిపురంలోని జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహ పర్యావరణ ప్రముఖ్ రాకేష్ జైన్ అన్నారు. బుధవారం వనస్థలిపురంలోని మొదటిముద్ద మిల్లెట్ తినుబండారాల తయారీ యూనిట్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న నిస్వార్ధ సేవలు, విలువలతో కూడిన వ్యాపారాన్ని రాకేష్ జైన్ కొనియాడారు.
శ్రీనివాస్ తమ సంస్థలో, ఇంట్లో తాను పాటిస్తూన్నదే సమాజ హితంకోరి బయటికి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్లయితే ప్రకృతి వనరులను ఆదా చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఎం.దత్తాత్రేయ, భాస్కర్, పర్యావరణ, సామాజిక కార్యకర్త గోపాల్ దాస్ రాము, చిత్తలూరి వేణు, యాదా రామలింగేశ్వర్రావు, పద్మజ, డాక్టర్ విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, నర్సింహులు, కోటేశ్వరరావు, రామకృష్ణ, శివరాం, భరత్, రమేష్, రామచంద్ర రావు, రాజేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.