06-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జనవరి5 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ అన్నారు. మధురానగర్ లోని తెలంగాణ మహిళా సహకార సంస్థ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జై భవాని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్‌ను రాష్ట్ర మహి ళా కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.