17-01-2026 03:34:54 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ సాకారంలో కీలక పాత్ర పోషించిన గొప్ప యోధుడు, రాజకీయ విలువలకు నిలువుటద్దం వంటి నేత దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్‌లో ఉన్న జైపా ల్ రెడ్డి స్మారక కేంద్రం స్ఫూర్తి స్థల్ వద్ద ఆయన 84వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రె డ్డి జైపాల్ రెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘ టించి, ఘన నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ జైపాల్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆ యనొక విలువల శిఖరమని అభివర్ణించారు.
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయా ల్లో తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చలేకుండా నిష్కళంక నేతగా జీవిం చారని ప్రశంసించారు. ముఖ్యంగా తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఢిల్లీ స్థాయిలో ఆయన పోషించిన నిర్మాణాత్మక పాత్రను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయన సేవలను స్మరించుకున్నారు.