calender_icon.png 17 January, 2026 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేళ్ల స్ఫూర్తితో ప్రజాపోరాటాలకు మరింతపదును పెడదాం

17-01-2026 03:33:31 AM

  1. పోరాటాల.. ఖమ్మం సభకు కదలండి

ఖమ్మం నగరాన్ని ఎర్ర సంద్రంలా మారుద్దాం

సీపీ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రికొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి, జనవరి 16 (విజయక్రాంతి) :వందేళ్ల స్పూర్తితో ప్రజాపోరాటాలకు మరింత పదును పెడదామని, ఖమ్మం నగరంలో సిపిఐ శతాబ్ది ము గింపుబహిరంగ సభను వేదికగా చేసుకునేందుకు సంసిద్ధులు కావాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరిగే శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెం పట్టణపరిధిలోని వన్నందాస్ గడ్డ, పాతకొత్తగూడెం, బర్మా క్యాంపు, ప్యూన్ బస్తి, బూడిదగడ్డ, మేదరబస్తీ, ప్రగతి నగర్,

లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో అ యన పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల ఆగడాలను అడ్డుకోగల శక్తి కేవలం ఎర్రజెండాకే ఉంద న్న విషయాన్ని ఈ వందేళ్ల చరిత్ర నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మంలో ప్రదర్శించబోయే వేలాది మంది క్రమశిక్షణాయుత రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, విప్లవ గీతాల సాంస్కృతిక ప్రదర్శనలు పీడిత వర్గా ల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని తెలిపా రు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఈ సభను సక్సెస్ చేయాలని కోరా రు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా ప్రచార జాతుల ద్వారా విస్తృతంగా ప్రచారం పూర్తిచేశామని, కరపత్రాలు, పోస్టర్లు, మీడియా మాధ్యమాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు, ప్రతి గ డపకు బహిరంగసభ సమాచారాన్ని చేరవేశామని, లక్షమంది జిల్లా నుంచి స్వచ్చం దంగా ఖమ్మం తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సమావేశాల్లో సిపిఐ జి ల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి స భ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, నాయకులు నూనావత్ గోవిందు, గోపి కృష్ణ, గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీను, శాపావత్ రవి, మోతిరాం, రాములు తదితరులు పాల్గొన్నారు.