17-01-2026 03:36:27 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 16, (విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం గత 11 సం రాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం (ప్రజల హక్కులను కాలరాయడమే కాక, రాష్ట్రాల హక్కులను హరిస్తూ రైతు వ్యతిరేక, కార్మిక చట్టాలను చేసింది. ఈ చట్టాలకు వ్యతిరేకం గా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేయం జా తీయ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జీవో ప్రతులను దగ్ధం చేశారు.
అమర్లపూడి రా ము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాని ఉ ద్దేశించి అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఇల్లెం దు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరస య్య, బచ్చలకూర శ్రీను, ఏనుగు సాగర్, కం దగట్ల సురేందర్ ,కోరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక వైపున ప్రజాసంక్షేమం వల్లిస్తూ గత 11సంeరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిం ది.
చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీ వంటి బదాపెట్టుబడి దారులకు కట్టబెడుతొందని ధ్వజమెత్తారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోట్లను అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విలి-జి రామ్ జి చట్టం, బీమా రంగంలోనికి 100శా తం విదేశీ పనెట్టుబడులకు అనుమతి, అణురంగంలోనికి ప్రవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ అణు చట్టం చేసిందన్నారు. వేతనాల కోడ్ 2019 ప్రకారం పారిశ్రామిక వేత్తలు కనీస వేతనాలు ఇవ్వకుండా, తక్కువ వేతనాలతో పనులు చేయించుకోవడానికి వెసులు బాటు ఉందని ఇప్పటికే కనీస వేతనాలు కూడా లభించక కార్మికులు వేతనాల కొరకు ఆందోళనలు చేస్తున్నారు,
పారిశ్రామిక సం బంధాల కోడ్ అనగా కార్మికులు ట్రేడయూనియన్లు పెట్టుకోకుండా ఆంక్షలు పెట్టడం , సామాజిక భద్రత కోడ్ 2020, అసంఘటిత కార్మికుల ద్వారానే కార్పొరేట్ లాభాలు సం పాదించడం, వృత్తి రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితులు కోడ్, కార్మికుల కొరకు కోడ్ల వలన గతంలో 100 మంది. కార్మికులు పని చేసే పరిశ్రమను మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ట్రేడ్ యూనియన్ చ ట్టాల కింద గుర్తించగా,
మార్చిన విధానాల వల్ల ఆ సంఖ్యను 300లకు పెంచారు. 300 లోపు కార్మికులు పని చేసే కంపెనీపై ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేకుండా చేశార న్నారు. ఈ రంగంలో కార్పొరేట్ సంస్థలు తమ స్వలాభం కొరకే తప్ప కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక న్యాయం పాటించడం, (రిజర్వేషన్లు) సామాజిక బాధ్యత నిర్వర్తించడం, పన్నులు సక్రమంగా చెల్లించడం లాంటి పనులు చేయకుండా అక్రమ మార్గలద్వారా బిలియనీర్లుగా మారుతు న్నారని దుయ్యబట్టారు.
వికపిత్ భారత్- జి. రామ్ జో’ చట్టాన్ని రద్దు చేయాలి
వామపక్షాల పోరాట ఫలితంగా 2006 లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం -2006‘ రూపొందింది. దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంeరంలో 100 రోజుల పని కల్పించాలి.
ప్రస్తుతం రోజుకు 307 రూపాయలు ఇవ్వాలి. దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్రం 10 శాతం రాష్ట్రాలు భరించాలి. ఈ చట్టం ద్వారా కరువుల్లో కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికింది. ఈ కార్యక్రమం కింద 17-12-2025న 26.66 కోట్ల మంది పని చేస్తున్నారు. అందులో దళితులు 18.63 శాశం, గిరిజనులు 17.32 శాతం ఉపాధి పొందుతున్నా రు. దేశంలో 741 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. వాస్తవ వ్యయం ఈ విధంగా ఉందని అన్నారు .
ఈ కార్యక్రమంలో ఎస్ కే యం నాయకులు ఎం బిక్షం అన్న. కల్లన్న జాటోత్ కృష్ణ గోకినపల్లి ప్రభాకర్ ఆర్ బోస్ బానోతు. ధర్మ..బైరు వెంకన్న కల్లూరి కిషోర్ ఎం రాజశేఖర్ రమేష్ భానోత్ వీరన్న.తుపాకుల నాగేశ్వరావు ఎస్ కే ఉమర్ రాంమ్మూర్తి, మలుగూరి సుగుణ గుగులోతు రామచందర్ సాంబ గణేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.