calender_icon.png 14 October, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కాశ్మీర్ యువతి ఆత్మహత్య

12-11-2024 03:18:22 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని యువతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మృతురాలు జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్‌ నబీ దార్‌ గా భావిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో శ్యాంపిల్‌ ఎగ్జిక్యూషన్‌ అనలిస్ట్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.