28-01-2026 12:00:00 AM
అలంపూర్, జనవరి 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపునిచ్చిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు ఆ పార్టీ అలంపూర్ నియోజకవర్గం అడ్ హాక్ కమిటీ సభ్యుడు మహేష్ నాయుడు తెలిపారు.ఈ మేరకు మంగళవారం అలంపూర్ పట్టణ కేంద్రంలోని హరిత టూరిజం హోటల్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మహేష్ నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర జనసేన పార్టీ కమిటీ ఆదేశాల మే రకు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపాలిటీలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.జనసేన పార్టీ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జన సైనికులు,వీర మహిళలు ఆశావాహులు బరిలో నిలిచే ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నా యకులు భాస్కర్, రఘు, జమేషు, లోకేష్, మద్దిలేటి, డేరన్, పరుశు రాముడు, మున్నూరు మధు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.