14-08-2025 01:31:18 AM
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కోరారు. పాదయాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా ప్రణాళికలు చేయాలని తెలి పా రు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం జూమ్ స మావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు డీసీసీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన బీజేపీ, ఈసీ అ క్రమాలపై ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేపట్టాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు వెంటనే వేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాలు వెంటనే పంపాలని సూచించారు. రాష్ర్టంలో తీవ్రమైన వర్షాలు, వరద పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలకు కాంగ్రెస్ క్యాడర్ అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించి భరోసా కల్పించాలని ఆయన సూచించారు.