calender_icon.png 17 August, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలు సన్న బియ్యం కొనాల్సిన పనిలే

14-08-2025 01:32:33 AM

3340 రేషన్ కార్డులు, 1500 ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ లు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఆగస్టు 13 (విజయ క్రాంతి) : పండుగొచ్చిందంటే సన్న బియ్యం కొనుక్కొచ్చి పండుగ చేసుకునే రోజులకు కాలం చెల్లిందని ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం రేషన్ షాపుల్లో రఫరా చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శిల్పారామం లో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 3340 మంది లబ్ధి దారులకు రేషన్ కార్డులను, 1500 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. భారత దేశం లో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణా రాష్ట్రం లోనే రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామనిగుర్తు చేశారు. పేద ప్రజలు గతంలో మాదిరిగా సన్న బియ్యం కొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ప్రజా ప్రభుత్వం అంటేనే సంక్షేమం అనే విధంగా సిఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ పాలన ఉందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడ బిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహిళా అధ్యక్షురాలు వసంత, నాయకులు సిజె బెనహర్, ఏర్పుల నాగరాజు, ఫయాజ్, అజ్మత్ అలి,బండి మల్లేష్, జహీర్, లీడర్ రఘు, ఫైసల్ , రఘు డీలర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.