10-11-2025 01:24:17 AM
సీకో కాయ్ మంథని విద్యార్థుల ప్రతిభ
మంథని, నవంబర్ 9 (విజయక్రాంతి)కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియం లో మూడు రోజుల పాటు జాతీయ కరాటే పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో జపాన్ షిటోరియు శికో కాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ కి చెందిన మంథని విద్యార్థినీ విద్యార్థులు బిలో 12 ఇయర్స్, ఎబోవ్ 12 ఇయర్స్ కథ కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచారు. బంగారు, వెండి పథకాలు సాధించారు.
పథకాలు సాధించిన వారిలో బంగారు పథకాలు సాధించిన వారుఎండి తహసీన్ తైభ, మారేడు కొండ రిషి, మాచర్ల శివ, మారేడు కొండ నిహారిక, నిషిత్, వెండి పథకాలు సాధించారు. బొగ్గుల మనోజ్ఞ, జడగాల సహస్ర, జడగాల మనస్వి లు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిని షిటోరియు సికో కాయి, కియో ఇండియా అధ్యక్షులు పి. భరత్ శర్మ తెలంగాణ స్పోరట్స్ కరాటే అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ షిటోరియు షికో కాయికరాటే రిప్రజెంటివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఇప్ప శ్రీనివాస్, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగేల్లి రాకేష్, జడగల శివాని, కావేటి శివ, గణేష్, కే విష్ణు, హర్షవర్ధన్, మెట్టు హాసిని, గేయ శ్రీ రామ్, తేజ శ్రీ, రాములు అభినందించారు.