10-11-2025 01:23:12 AM
ముకరంపురా, మవంబర్ 9(విజయక్రాంతి): సాంస్కృతిక పోటీలు విద్యార్థులలోఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గురూస్, స్టూడెంట్స్ & పేరెంట్స్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యి పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలను అందించారు.
ఈ సందర్భంగా డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన విద్య అంటే వ్యక్తిత్వ వికాసం, ఆ వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఒక అధ్భుతమైన వేదిక. దీని ద్వారా వ్యక్తులలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీస్తాయి. వేదికల పైన మాట్లాడే ధైర్యం వస్తుంది అని అన్నారు. ఈ సాంస్కృతిక పోటీలలో భాగమైన సంగీత వాయిద్య పోటీలో దైవాల హిమబిందు వాయించిన పియానో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో జి.ఎస్.పి. డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం, ముఖ్య అతిధి డాక్టర్ ఆట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపాద్యక్షులు అటుకాపురం డప్పురాజేష్, న్యాయనిర్ణేతలు శ్రీరామోజు రామకృష్ణ, గజ్జెల ధర్మేందర్, మిలీనియం శ్రీనివాస్, చందుపట్ల, జయలక్ష్మి ఆత్మీయ అతిథులు దువ్వాసి రవిందర్, దువ్వాసి సౌచన్య, అంజలి, చిలుక సుమన్ సంధ్య, గున్నాల లక్ష్మణ్- శారద, ఈశ్వర్, శ్రీజ ఏద్యార్థినీ విద్యార్థులు, కవులు, కళాకారులు, రచయితలు తదితరులుపాల్గొన్నారు.