10-12-2025 01:41:49 AM
రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న స్వప్న సినిమాస్ అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్ ‘సల్లంగుండాలే..’ను రిలీజ్ చేశారు. ‘సల్లంగుండాలే.. సల్లగుండాలే.. పెండ్లిజేసుకోని నువ్వు పైలంగ వుండాలే.. సల్లంగుండాలే.. సల్లగుండాలే.. పిల్లపాపలతో నువ్వు పచ్చంగ వుండాలే..
నవ్వుతూ నువ్వుంటే.. నిన్నిట్టా సూత్తాంటే.. కట్టాల్లళ్ల కన్నీళ్లల్ల ఎంతో సంబురం..’ అంటూ సాగుతోందీ గీతం. అప్పగింతల సమయంలోని భావోద్వేగాల నేపథ్యంలో వచ్చే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా రితేశ్ జీ రావు, మనీషా ఈరబత్తిని ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: ఆర్ మధీ; సంగీతం: మిక్కీ జే మేయర్; ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు.