calender_icon.png 6 August, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్

06-08-2025 06:00:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ కాండ్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. ఇంటి నిర్మాణాన్ని వేగంగా, నాణ్యంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల వివరాలను కలెక్టర్ సమీక్షించారు. ఇసుక సహా ఇతర నిర్మాణ ముడి సరుకుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, ఏఈ, అధికారులు పాల్గొన్నారు.