calender_icon.png 12 October, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఝాన్సీ శామ్యూల్‌కు జీవిత సాఫల్య పురస్కారం

12-10-2025 01:52:09 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్), యునెస్కో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పొద్దుటూరి ఝాన్సీ శామ్యూల్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమాజ సేవ, మహిళా శక్తి అభివృద్ధి, విద్యా రంగం, సామాజిక అవగాహన కోసం చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఝాన్సీ శామ్యూల్ సేవలను ప్రశంసిస్తూ, ఆమె సమాజానికి ఆదర్శమని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు.