12-10-2025 01:50:55 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేప ట్టిన శివధర్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటే శం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్ కుమార్, ఉపాధ్యక్షులు ఎలమొని భాస్కర్, లైబ్రరీ సెక్రెటరీ నిట్టు పాండు శనివారం కలి సి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీజీపీని సన్మానించారు. ఈ సందర్భంగా ఇబ్ర హీంపట్నంలో మొత్తం ఎన్ని కోర్టులు ఉన్నా యి, వాటిలో క్రిమినల్ కేసులు డిస్పోసల్ గురించి, కోర్టులో మౌలిక వసతుల గురించి, సీనియర్ న్యాయవాదుల గురించి డీజీపీ అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా ఇబ్రహీంపట్నం కోర్టు భవన సముదాయం కోసం ప్రభుత్వం 12 (102) కోర్ట్స్ భవన సముదాయాన్ని కేటాయించిన విషయాన్ని డీజీపీకి తెలిపారు. ప్రభుత్వం నుంచి తన వంతు సహకారాన్ని అందిస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ర్ట న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని కలిశారు. ప్రభుత్వం రూ.120 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన 102 (12) కోర్టుల భవన సముదాయాలకు నిధులు విడుదల చేసేందుకు సహకరించాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.