12-10-2025 01:53:27 AM
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిక్కచ్చిగా, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని హైదరా బాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ సెక్టార్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో శనివారం శిక్ష ణ కార్యక్రమం నిర్వహించారు.
విధులు, బాధ్యతలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్‌వి కర్ణన్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తలోగద్ద న్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత,పారదర్శక ఎన్నికలు జరిగేలా పూర్తి సహకారం అందించాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు.
ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా సకాలంలో రిపోర్ట్ లు అందజేయాలన్నారు. కార్యక్ర మంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ సునంద పాల్గొన్నారు.
కాగా ఈ నెల 13 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవ్వనుండడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంను కర్ణన్ సందర్శించారు. సన్నద్ధతను ఆర్వో, ఏఆర్వోలతో సమీ క్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు.